English | Telugu

బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే షూట్.. 'ఏజెంట్' రిజల్ట్ పై నిర్మాత ఎమోషనల్ కామెంట్స్!

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఏజెంట్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలైంది. మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. రెండో రోజుకే పూర్తిగా చేతులెత్తేసింది. దాదాపు రూ.37 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఏకంగా రూ.30 కోట్ల నష్టాలను మిగిల్చే అవకాశముంది. టాలీవుడ్ చరిత్రలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ క్రమంలో ఈ సినిమా పరాజయం పట్ల నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏజెంట్ ఫలితంపై పూర్తి బాధ్యత తమదేనని అనిల్ సుంకర అన్నారు. ఇది పెద్ద టాస్క్ అని తెలిసి కూడా, గెలుస్తామనే ఆలోచనతో ముందడుగు వేశామని తెలిపారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం తాము చేసిన పెద్ద తప్పని, దాంతో పాటు కోవిడ్ సహా పలు సమస్యలు చుట్టుముట్టాయని చెప్పారు. ఈ ఖరీదైన తప్పు నుంచి పాఠాలు నేర్చుకున్నామని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు. సరైన ప్రణాళికతో, బాగా కష్టపడి భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్ లు అందిస్తామని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'భోళా శంకర్' చిత్ర రూపొందుతోంది. ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఏజెంట్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి భోళా శంకర్ బయట పడేస్తాడేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.