English | Telugu

తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్‌ నటి!

ఈమధ్యకాలంలో బాగా విస్తరించిన సోషల్‌ మీడియా వల్ల ఎన్ని విధాలుగా ఉపయోగాలు ఉన్నాయో.. అనర్థాలు కూడా అన్నే ఉంటున్నాయి. కొందరు సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయడమే కాదు, ఇతరులను మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులు అనేకం అందుతున్నాయి. టాలీవుడ్‌ నటి రంగసుధ ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారనని ఆమె ఆరోపించారు. (Ranga Sudha)

వివరాల్లోకి వెళితే.. నటి రంగసుధ కొన్నాళ్ళ క్రితం రాధాకృష్ణ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నారు. వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సుధ ఒంటరిగానే ఉంటున్నారు. తనకు దూరంగా ఉందన్న కోపంతో రాధాకృష్ణ ఈ చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. కొన్ని సోషల్‌ మీడియా పేజీలతో కలిసి రంగసుధను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని సుధ పేర్కొన్నారు. తాను రాధాకృష్ణతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోలను ఆన్‌లైన్‌లో పెడతానని గతంలోనే బెదిరించాడని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రంగసుధ కేసు విషయంలో విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.