English | Telugu

జాతీయ స్థాయి ఛాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకం సాధించిన ప్రగతి!

కె.భాగ్యరాజా దర్శకత్వంలో తమిళ్‌లో వచ్చిన ‘వీట్ల విశేషం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత రెండు సంవత్సరాలపాటు ఓ అరడజను సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత తెలుగులో మహేష్‌ హీరోగా వచ్చిన ‘బాబీ’ చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసింది ప్రగతి. చాలా తక్కువ టైమ్‌లోనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినిమాల్లో అక్క, తల్లి, వదిన వంటి పాత్రల్లో బాగా రాణిస్తున్న ప్రగతి సినిమాలకు సమయం కేటాయిస్తూనే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం కూడా బాగా కష్టపడుతుంటారు.

సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రగతి ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తను జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలను చాలా సార్లు షేర్‌ చేసింది ప్రగతి. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో కాంస్య పతకం సాధించి తన సంతోషాన్ని అందరితోనూ పంచుకుంది. ఇటీవల బెంగళూరులో 28వ పురుషులు, మహిళల జాతీయ స్థాయి బెంచ్‌ ప్రెస్‌ చాంపియన్‌ షిప్‌ జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రగతి మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. ఈ పోటీలకు బెంగళూరులోని ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆడిటోరియం వేదికగా నిలిచింది. ప్రొఫెషనల్‌ పవర్‌ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించడం విశేషం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.