English | Telugu
బుట్టబొమ్మ పూజా హేగ్దే ని చంపుతామని బెదిరింపులు
Updated : Dec 13, 2023
తెలుగులో అందరి టాప్ హీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటీమణి పూజ హెగ్డే.. ఇప్పుడంటే తన హవా కొంచం తగ్గింది కానీ కొన్నేళ్ల క్రితం ఏ తెలుగు సినిమా చూసినా కూడా అందులో హీరోయిన్ గా పూజానే ఉండేది. తాజాగా పూజాని చంపుతామనే ఒక న్యూస్ బయటకి రావడంతో అందరు షాక్ అవుతున్నారు.
ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని తన ఇనిస్టాగ్రామ్ హ్యాండిల్ లో పూజ ఒక క్లబ్ ప్రారంభోత్సవానికి దుబాయ్ వెళ్లనప్పుడు పూజకి కొంత మంది వ్యక్తులకి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ సందర్భంలో పూజా ని చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. కానీ పూజ అక్కడ నుంచి వచ్చేసిందని వైరల్ భయాని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్క సారిగా షాక్ కి గురయ్యింది. కాగా వైరల్ భయాని ఇపుడు తన ఇనిస్టా లో ఉన్న పూజ విషయాన్ని డిలీట్ చేసాడు. తనకి వచ్చిన బెదిరింపులు గురించి పూజా చెప్తే గాని పూర్తి విషయాలు తెలియవు
పూజ కి ప్రస్తుతం తెలుగులో సినిమాలేమి లేవు. సాయి ధరమ్ తేజ్ తో గాంజా శంకర్ అనే మూవీ చేస్తుందని అంటున్నారు.కానీ ఇంకా ఆ చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కాగా పూజ హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.