English | Telugu

విజయ్ దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన వ్యక్తి అరెస్ట్!

విజయ్ దేవరకొండపై తాజాగా అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం విజయ్ సినిమాలకు సంబంధించి అసభ్యకర వార్తలను ప్రసారం చేశాడు. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా విజయ్ ను అవమానిస్తూ అసత్యపు వార్తలను ప్రసారం చేశాడు. విజయ్ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉండటంతో పాటు, ఆయన సినిమాలలోని హీరోయిన్ లను అవమానిస్తూ చేసిన ఈ యూట్యూబ్ వీడియోలను.. విజయ్ టీం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు.

కేసు నెంబర్: 2590/2023 గా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలని, ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాదు భవిష్యత్ లో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు టార్గెటెడ్ గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.