English | Telugu

1000 సినిమాలతో గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన నటి మనోరమ.. ఆమెకు దక్కనున్న మరో అరుదైన గౌరవం!

భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు తమ నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. కొందరు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో ఒక సుస్థిరమైన ముద్ర వేశారు. ఆయా నటీనటులు వెళ్లిపోయినా వారు చేసిన సినిమాలు, వారి అభినయం ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. నటీమణుల విషయానికి వస్తే.. భారతీయ చిత్ర పరిశ్రమకి ఎంతో మంది నటీమణులు వచ్చారు. వారిలో కొందరు తమ అసమాన నటనతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. వారిలో తమిళనటి మనోరమకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకే భాషకు పరిమితం కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. అన్ని సినిమాల్లో నటించిన ఏకైక నటీమణిగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు మనోరమ.

1937 మే 26న తమిళనాడులోని మన్నార్‌గుడిలో జన్మించారు మనోరమ. ఆమె అసలు పేరు గోపిశాంత. 11 ఏళ్ళ వయసులో పాఠశాల చదువును ఆపేసి నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలోనే ఆమె పేరును మనోరమగా మార్చారు. అలాగే ఆమెకు ఆచి అనే పేరు కూడా ఉంది. 1958లో నటిగా సినిమాల్లోకి వచ్చిన ఆమె 50 ఏళ్ళ కెరీర్‌లో 1000కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించగల మనోరమ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సినిమా పరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక నేషనల్‌ అవార్డుతోపాటు, ఒక ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా ఏడు తమిళనాడు స్టేట్‌ అవార్డులు పొందారు.

తాజాగా ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోనుంది. చెన్నయ్‌లో ఆమె నివసించిన వీధికి ఆమె పేరునే పెట్టాలని దక్షిణ భారత నటీనటుల సంఘం ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. టి.నగర్‌లో ఉన్న నీలకంఠ మెహతా వీధిలో ఆమె ఎక్కువ కాలం నివసించారు. మనోరమ జ్ఞాపకార్థం ఆ వీధి పేరును ‘మనోరమ స్ట్రీట్‌’గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వెయ్యి సినిమాలకు పైగా నటించి చరిత్ర సృష్టించిన ఏకైక మహిళగా పేరు తెచ్చుకున్న మనోరమ పేరును ఒక వీధికి పెట్టడం అనేది ఆమెకు నిజమైన నివాళిగా చెప్పుకోవచ్చు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.