English | Telugu
నేను బ్రతికే ఉన్నాను: కనక
Updated : Jul 31, 2013
నటి కనక మహాలక్ష్మి చనిపోయిందని పలు వార్తలు వస్తున్నాయి. దీంతో కనక మహాలక్ష్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తాను బతికే ఉన్నట్లు అందరికి తెలియజేసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నేను చనిపోలేదు. నేను చనిపోయినట్లుగా వస్తున్న రూమర్స్ ను నమ్మకండి. నా ఆరోగ్యం బాగానే ఉంది. నాకు ఎలాంటి క్యాన్సర్ వంటివి లేవు. నేను చాలా బాగున్నాను. కొన్ని నా వ్యక్తిగత కారణాల వల్లే నేను సినిమాలకు దూరంగా ఉన్నాను. కానీ త్వరలోనే మళ్ళీ సినిమాల్లోకి వస్తాను. ఏదైనా మంచి పాత్ర దొరికితే ఖచ్చితంగా చేస్తాను అని తెలిపింది.