English | Telugu
బెంగాలీలో బిజినెస్ మాన్ రీమేక్
Updated : Aug 1, 2013
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "బిజినెస్ మాన్" చిత్రం తెలుగు, తమిళ, మలయాళం భాషలలో ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. మహేష్ బాబు, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని బెంగాలీ భాషలో రీమేక్ చేస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని బెంగాలీ భాషలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి "బాస్" అనే టైటిల్ ని ఖరారు చేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. గతంలో తెలుగులో విజయం సాధించిన "విక్రమార్కుడు", "గమ్యం", "కృష్ణ" వంటి చిత్రాలు బెంగాలీ భాషలో రీమేక్ అయ్యి, అక్కడ కూడా మంచి విజయం సాధించాయి.