English | Telugu

'గోపాల గోపాల' థియేటర్ల పై దాడి, కేసులు

వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన 'గోపాల గోపాల' మూవీ విడుదలై ఇంకా ఒక్కరోజు కూడా పుర్తికాలేదు, అప్పుడే ఈ సినిమాపై కేసులు, ఈ సినిమా ఆడుతున్న థియేటర్ లపై దాడులు మొదలయ్యాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలను కించపరిచేలా వుందని రఘునాథరావు అనే వ్యక్తి హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే అతను ఈ సినిమా చూసాకే కేసు పెట్టడా లేక పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా అన్నది తెలియాల్సిన విషయం. అలాగే హైదరాబాద్ చౌటుప్పల్‌లో ‘గోపాల గోపాల’ ప్రదర్శితమవుతున్న థియేటర్ మీద కొంతమంది దాడి చేశారు. థియేటర్లో ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేసి సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. అయితే వీరంతా సినిమాలో తమ అభ్యంతరాలను తెలియజేయకుండా థియేటర్ల పై విచిత్రంగా వుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.