English | Telugu

మహేష్ 'ఆగడు' రిలీజ్ వాయిదా?

సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఆగడు' రిలీజ్ వాయిదాపడే అవకాశాలు వున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 19న లేదా 26న విడుదల చేయాలని భావించారు. ఇప్పుడు ఆ టైమ్ కి సినిమా మొదటి కాపీ వచ్చే చాన్స్‌లేదని తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆడియో రిలీజ్ మాత్రం అనుకున్న తేదీ కన్నా మూడురోజుల ముందే ఉంటుందట. అన్నీ కుదిరితే ఈ చిత్రం అక్టోబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది. ఈనెల 23 వరకు మహేష్ - తమన్నా‌లపై యూరప్‌లో సాంగ్స్ షూట్ చేస్తారని యూనిట్ సభ్యులు తెలిపారు. దూకుడు తరువాత శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.