English | Telugu

మహేష్ ని ఖుషీ చేసిన 'ఆగడు'

'ఆగడు' సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని వంద శాతం నమ్మకంగా వున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ సినిమాకి డబ్బింగ్ పూర్తిచేసిన మహేష్ ఫైనల్ వెర్షన్ చూసి ఫుల్ ఖుషీగా అయ్యాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు మహేష్. ఒక సినిమా పూర్తి చేసిన తరువాత నా కేరియార్ లో ఇప్పుడున్న౦త సంతోషంగా ఎప్పుడూ లేను. ‘ఆగడు’ తన కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందని, ఇలాంటి సినిమాని తనకు ఇచ్చినందుకు శ్రీనువైట్ల కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎనర్జిటిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చేసిన ‘ఆగడు’ సినిమాపై తనకు భారీ అంచనాలున్నాయని పేర్కొన్నాడు మహేష్. మహేష్ బాబు, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా 19న విడుదలకు సిద్ధమవుతోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.