English | Telugu

ఆగస్ట్ 29న 'ఆగడు' ఆడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఆగడు' సినిమా ఆడియో రిలీజ్ కి ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ఆడియోను ఆగస్ట్ 29న గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మహేష్ పోలీస్ ఆఫీసర్‌గా చెబుతున్న డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ కోసం సినిమా యూనిట్ యూరప్ వెళ్ళేందుకు సిద్దమవుతున్నారు. నార్వే తో పాటు పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ చేయనున్నారు. దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.