English | Telugu

చిర౦జీవితో అరుంధతి..!!

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఈ ఏడాదిలోనే మొదలవుతుందని ఆయనే స్వయంగా నాగార్జున “మీలో ఎవరు కోటీశ్వరుడు” షోలో ప్రకటించారు. లేటెస్ట్ గా ఈ సినిమాలో అనుష్క ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. చిరుతో కలిసి “స్టాలిన్” సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడిన అనుష్క, ఇప్పుడు చిరు 150వ సినిమాలో అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా చిరు 150వ సినిమా గురించి ఒకదాని వెనుక మరొకటి వార్తలు బయటకి వస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.