English | Telugu
'విరూపాక్ష' ట్రైలర్ అదిరిపోయింది!
Updated : Apr 11, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ మిస్టరీ థ్రిల్లర్ ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మంగళవారం ఉదయం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన 'విరూపాక్ష' మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "హెచ్చరిక: ఈ ఊరికి రాకపోకలు నిషేధం" అని రాసున్న బోర్డు తగిలించిన ఊరిలోకి కథానాయకుడు ఎంటర్ అవ్వడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. రుద్రవనం అనే ఊరిలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి. అక్కడ ఎందరో ప్రజలు చనిపోతుంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? దాని వెనుక ఎవరున్నారు? అనే మిస్టరీ ఛేదించడానికి కథానాయకుడు రంగంలోకి దిగుతాడు. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠను రేకెత్తించేలా ట్రైలర్ ను రూపొందించారు. శాందత్ సాయినుద్దీన్ కెమెరా పనితనం, అజనీష్ లోకనాథ్ సంగీతం ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సాయి తేజ్ ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమనిపిస్తోంది.