English | Telugu

చియాన్ ఫ్యాన్స్ టెన్షన్ ని తగ్గించిన మేనేజర్

కొన్ని సినిమాలు విడుదల కావడానికి నెలల సమయం ఉన్నా కూడా ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒక సినిమా చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న తంగలాన్. ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ నిమిత్తం విక్రమ్ హైదరాబాద్ వచ్చాడు. మీడియా తో ముచ్చటించే క్రమంలో తంగలాన్ మూవీలో తన క్యారక్టర్ కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు విక్రమ్ అభిమానులతో పాటు సినీ అభిమానులని కూడా షాక్ కి గురి చేసాయి. ఇప్పుడు విక్రమ్ మేనేజర్ ఆ వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చాడు.

మీడియా సమావేశంలో విక్రమ్ మాట్లాడుతు తంగలాన్ లో నాకు డైలాగ్స్ ఉండవని తాను గతంలో శివ పుత్రుడు సినిమాలో పోషించిన క్యారక్టర్ తరహాలో నా పాత్ర ఉంటుందని చెప్పాడు. తంగలాన్ టీజర్ రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి తమ అభిమాన కధానాయకుడు మూవీ లో పోషించే క్యారక్టర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చియాన్ ప్యాన్స్ ఆందోళనకి గురయ్యి సోషల్ మీడియా వేదికగా రకరకాల రీతిలో తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. దీంతో చియాన్ మేనేజర్ రంగంలోకి దిగి చియాన్ చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. విక్రమ్ గారి ఉద్దేశంలో నాకు టీజర్ లో మాత్రమే డైలాగ్స్ లేవనే అర్ధమని ఆయన పలికిన ఉచ్చారణలోని చిన్న తేడా వల్ల విక్రమ్ గారికి సినిమా లో డైలాగ్స్ లేవని అభిమానులు అనుకుంటున్నారని నూటికి నూరుపాళ్లు తంగలాన్ లో విక్రమ్ గారికి డైలాగ్స్ ఉంటాయని చెప్పడంతో ప్యాన్స్ రిలాక్స్ అయ్యారు. తంగలాన్ చిత్రానికి లైవ్ సింక్ సౌండ్ కూడా వినియోగించడం జరిగిందని మేనేజర్ సూర్య నారాయణ చెప్పాడు.

ఇటీవలే తంగలాన్ టీజర్ రిలీజ్ అయ్యి రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించింది. విక్రమ్ తాలూకు నట విశ్వరూపం ఎలా ఉంటుందో ఆయన నటించిన ఎన్నో సినిమా లు ప్రేక్షకులకి తెలియచేశాయి. తాను పోషించే క్యారక్టర్ కోసం విక్రమ్ ఎంతైనా కష్టపడతాడు. తంగలాన్ లో కూడా క్యారక్టర్ కోసం బాగా సన్నపడటమే కాకుండా ఒంటి మీద కేవలం చిన్న వస్త్రం మాత్రమే ధరించి గుబురు గడ్డంతో నటించాడు. పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న తంగలాన్ కి కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .