English | Telugu
విజయ్, మృణాల్.. అలా మొదలైంది!
Updated : Jun 14, 2023
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'గీత గోవిందం' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సినిమా ప్రకటించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తుండగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరించనున్నారు. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, అందరినీ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. హైదరాబాదులో ఈరోజు(జూన్ 14) ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షాట్ ను గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు. ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
విజయ్ కి ఇది 13 వ సినిమా కాగా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా విజయ్ మొదటిసారి వారితో చేతులు కలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది.