English | Telugu

సైతాన్ వెబ్ సిరీస్ రివ్యూ!

వెబ్ సిరీస్ పేరు: సైతాన్
నటీనటులు: రిషి, షెల్లీ నబు కుమార్, కామాక్షి భాస్కర్ల, మణికందన్ ఆర్ ఆచారి, రవి కుమార్, రవి కాలే, దేవియాని శర్మ, అనీషా దామ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న తదితరులు
సినిమాటోగ్రఫీ: షణ్ముఖ సుందరం
మ్యూజిక్: శ్రీరామ్ మడ్డూరి
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేశన్
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి వి రాఘవ్
ప్రొడక్షన్ కంపెనీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్, త్రి ఆటమ్ లీవ్స్
ఓటిటి : డిస్నీ ప్లస్ హాట్ స్టార్


కొన్ని వెబ్ సిరీస్ లు రిలీజ్ కి ముందే వివాదాలకు గురవుతుంటాయి.‌ అలాంటి వాటిల్లో 'సైతాన్' ఒకటి. బోల్డ్ డైలాగ్స్, రక్తం, దాడి వంటి వాటిని మేళవించి మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం

కథ:

ముగ్గురు పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టడానికి ఒక అమ్మ, యాకుబ్ అనే ఒక కానిస్టేబుల్ తో రోజూ గడుపుతుంది. అయితే ఆ యాకుబ్ బాలి(రిషి) వాళ్ళ అమ్మని వాడుకొని సరైన డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళ జీవనశైలి మరింత భయంకరంగా సాగుతుంది. ఒక దశలో తమ్ముడు ఆకలవుతుందని బాలితో చెప్తే జేబులో ఉన్న రెండు రూపాయలతో బన్ కొనిస్తాడు. అలా సాగుతున్న వాళ్ళ జీవతాలలో.. ఒక రోజు కానిస్టేబుల్ యాకుబ్ రోజులాగే బాలి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ముసలి దానివయ్యావని చెప్పి, ఆమెకూతిరిని లోపలికి తీసుకెళ్ళి తనని పాడుచేయాలని చూస్తాడు. అప్పుడే బాలి వచ్చి వావి వరుసలు లేని ఇలాంటివాడిని నరికేయాలని భావించి తల నరికేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోతాడు. అయితే బాలితో పాటు చెల్లి, తమ్ముడుసరైన తిండి లేక బ్రతుకుతుంటారు. బాలి ఒక మనిషిగా తను బతకడానికి ఎందుకు ఇలా మారాడు? తన కుటుంబానికి బాలి అండగా నిలబడ్డాడా? పోలీస్ క్రైమ్ లిస్ట్ లో మోస్ట్ వాంటెడ్ గా బాలి ఎందుకు ఉన్నాడో తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

బాలి కథ ఇది. తనతో పాటు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు లాంటి ఆసక్తికరమైన అంశాలతో కథ మొదలవుతుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ చేస్తోన్న తప్పుకి శిక్షగా అతడి తల నరికేసినప్పుడు బాలి పొందిన సంతోషం, ఆనందం ఇంకెప్పుడు తనకు కలుగలేదంట.‌ ఒక కోడి లేదా మేక తల నరికినప్పుడు చూడలేక భయపడిన ఒక వ్యక్తి(బాలి).. ఒక మనిషి తల నరికినప్పుడు భయం లేకుండా తన మనసులో సంతోషం కన్పించిందంట, అలాగే వాళ్ళ కుటుంబానికి అతను ఇచ్చిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి తను చేసింది తప్పే కాదని తన వాళ్ళ కోసం ఎంత మందినైనా చంపాలని నిర్ణయించుకుంటాడు బాలి.

కథలో ఎక్కడ స్లో సీన్స్ కానీ లెంతీ సీన్స్ కానీ ఉండకుండా జాగ్రత్త పడ్డాడు మహి వి రాఘవ. అయితే బాలి ఒక నేరస్తుడిగా మారడానికి బలమైన బ్యాక్ గ్రౌండ్ చూపించలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ ఎపిసోడ్ లో 'లాల్ సలాం' అంటూ కమ్యూనిస్టు భావాలవైపు మొగ్గుచూపడం.. వారిలో కలిసిపోవడం అవన్నీ కథని డైవర్ట్ చేసేదిగా ఉన్నాయి. మూడవ ఎపిసోడ్‌లో 'కింగ్ డమ్ ఆఫ్ సైతాన్స్' లాంగ్ అండ్ లెంతీ కంటెంట్ కోసం తప్పా పెద్దగా ఏమీ ఉండదు.

నాల్గవ ఎపిసోడ్‌లో 'ఎటాక్ కౌంటర్ ఎటాక్' పోలీసుల దాడి, కమ్యూనిస్ట్ ల ఎదురు దాడి.. ఇదంతా చూస్తుంటే వేణు ఉడుగుల డైరెక్ట్ చేసిన 'విరాట పర్వం' మూవీని గుర్తుతీసుకొస్తాయి. అయితే అందులో తను సమాజం కోసం కమ్యూనిస్ట్ లతో చేతులు కలిపితే, ఇందులో బాలి తన కుటుంబానికి తనకి ఎదురైన పరిస్థితులు మరెవ్వరికి రాకుండా ఉండాలని కలుస్తాడు. ఇక్కడే కథ స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా వెళ్తుంది. ఎటు చూసిన రక్తం, తుపాకులు, పోలీసులు, కమ్యూనిస్టులు, ఖైదీలు.. ఎంతసేపు ఒకటే పాత పచ్చడి.. ఏదీ కొత్తదనం అని చూస్తే ఏమీ ఉండదు‌. ఇది ఒక కొత్త పచ్చడి లా కనిపించే పాత పాడైపోయిన పచ్చడి. మనవాళ్ళంతా ఇప్పటికే చాలా చూసేసారు ఈ జానర్ సినిమాలు. కృష్ణవంశీ సింధూరం నుండి మొన్న వచ్చి‌న ఆచార్య వరకు అన్నీ అవే.. వాటన్నింటిని కలిపి కొత్త క్యారెక్టర్ లని తీసుకొని కొన్ని బోల్డ్ డైలాగ్స్ మాట్లాడిస్తే హిట్ అవుతుందని భావించిన మహి వి రాఘవ లెక్క తప్పింది.

బాలి చేసే హాత్యలకి అసలు లింక్ ఎక్కడుందనేది ప్రశ్నార్థకం. ఒక విప్లవవాదిగా కమ్యూనిస్ట్ దళంలో చేరిన బాలి.. జైలుకెళ్ళి ఒక సంబంధం లేని వ్యక్తిని చంపడం. మాటమాటకి బూతులు వాడటం ఎందుకో అర్థం కాదు. అసలు అవసరం లేని చోట్ల పనికిరాని సీన్లు చాలానే ఉన్నాయి. ఈ సిరీస్ మొత్తంగాతొమ్మిది ఎపిసోడ్‌ లు తీసాడు. మొదటి నాలుగు ఎపిసోడ్‌ లకే చూసే ప్రేక్షకులకి ఓపిక నశిస్తుందని చెప్పాలి. ఏదీ కొత్తగా లేకపోగ అదే పాత కంటెంట్.. సరైన స్క్రీన్ ప్లే లేదు. డల్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. ట్రిమ్ చేయాల్సినవి చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

బాలి పాత్రలో రిషి ఒదిగిపోయాడు. ఈ కథ మొత్తాన్ని నడిపించాడు. బోల్డ్ లుక్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంటే చూసే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. బాలికి చెల్లెలి పాత్రలో దేవియాని శర్మ బాగా నటించింది. బాలికి అమ్మగా షెల్లీ నబు కుమార్ ఆకట్టుకుంది. కమ్యూనిస్టు దళంలోని కామ్రేడ్ గా కామాక్షి భాస్కర్ల బాగా నటించింది. ఇక మిగిలిన వాళ్ళ వాళ్ళ పాత్రలకు తగ్గటుగా పర్వాలేదనిపించారు.

తెలుగు వన్ పర్ స్పెక్టివ్:

మహి వి రాఘవ తీసిన ఈ 'సైతాన్' ఫ్యామిలీతో కలిసి చూడలేం‌. ఒంటరిగా చూసే ఈ వెబ్ సిరీస్ లో కొత్తగా ఏమీ లేదు. వీకెండ్ లో టైం పాస్ కోసమైతే ఒకసారి చూసేయొచ్చు.

రేటింగ్ : 2.5 / 5

✍🏻. దాసరి మల్లేశ్

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.