English | Telugu
ఓటీటీలో 'ఆదిపురుష్' స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా!
Updated : Jun 14, 2023
'ఆదిపురుష్'తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వేటకి సిద్ధమయ్యారు. ఆయన శ్రీరాముడి పాత్ర పోషించిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న స్పందన చూస్తుంటే ఈ మూవీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. రామాయణ గాధ ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి దృష్ట్యా మరియు ఈ అద్భుతాన్ని బిగ్ స్క్రీన్ పైనే ఎక్కువ శాతం చూసేలా చేయాలన్న ఉద్దేశంతో ఓటీటీలో లేటుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.
ఇటీవల హిట్-ప్లాప్, చిన్న-పెద్ద అనే తేడా లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీ బాట పడుతున్నాయి. కానీ 'ఆదిపురుష్' మాత్రం ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానుందట. 'ఆదిపురుష్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. అయితే మిగతా సినిమాల్లాగా నాలుగు వారాల తర్వాత ప్రదర్శించేలా కాకుండా, ఎనిమిది వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారట. అంటే ఆగస్టు 11 తర్వాతే 'ఆదిపురుష్' ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
టి. సిరీస్ బ్యానర్ లో రూపొందిన 'ఆదిపురుష్'కి ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు.