English | Telugu
వెంకటేష్ రెండో కూతురి ఎంగేజ్ మెంట్.. చిరు, మహేష్ హాజరు
Updated : Oct 26, 2023
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మొదటి నుంచి లోప్రొఫైల్ మెయింటైన్ చేసే నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క విక్టరీ వెంకటేష్ మాతమ్రే అని చెప్పవచ్చు. తన కెరీర్ బిగినింగ్ నుంచి ఆయన ఇదే సూత్రాన్ని పాటిస్తూ వస్తున్నాడు. సినిమా వేరు ఫ్యామిలీ వేరు అన్న రీతిలో ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది. అందుకు నిదర్శనంగా తన ఇన్ని సంవత్సరాల సినీ జీవితంలో ఎక్కడ కూడా ఆయన ఫ్యామిలీ గురించిఎక్కడ మాట్లాడలేదు. ఎలాంటి న్యూస్ బయటికి కూడా రాదు. అంత పర్ఫెక్ట్ గా ఆయన ఉంటాడు. ఇప్పుడు అదే పర్ఫెక్ట్ తో తన రెండో కూతురు నిశ్చితార్దాన్ని జరిపించి అందరికి వెంకటేశ్ అంటే ఏంటో మరో సారి చాటి చెప్పాడు. సొసైటీ లో కొంచంపేరు ఉన్న వాళ్ళు, కొంచం డబ్బు ఉన్న వాళ్ళే తమ ఇళ్లల్లో జరిగే ఫంక్షన్కిఒక రేంజ్ లో హడావిడి చేస్తూ నానా హంగామానిసృష్టిస్తారు. కానీ ఒక సినిమా హీరోగా స్టార్ స్టేటస్ హోదా ఉన్న వెంకటేష్ మాత్రం వాళ్లందరికీ భిన్నంగా చాలా సింపుల్ గా తన కూతురు నిశ్చితార్థం జరిపించాడు.
విజయవాడకి చెందిన ఒక డాక్టర్ కుటుంబానికి చెందిన అబ్బాయితో వెంకటేష్ రెండో కూతురు హయవాహిని పెళ్లి నిశ్చయమయ్యింది. నిన్న చాలా అతి కొద్దిమంది అతిధుల సమక్షంలో హైదరాబాద్లో ఆ ఇద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది. వెంకటేష్ కి అత్యంత ఆప్తులు సినీ రంగానికి చెందిన అగ్ర హీరోలు అయిన చిరంజీవి,మహేష్ బాబు లు సతి సమేతంగా ఆ వేడుకకి హాజరయ్యారు . అలాగే రానా, నాగ చైతన్య లు కూడా ఫంక్షన్ చివరి వరకు ఉండి అన్ని కార్యక్రమాలని దగ్గరుండి మరి చూసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ లో చిరంజీవి అండ్ మహేష్ బాబు లు కాబోయే వధూవరువులిద్దరని ఆశీర్వదించడం ఉంది. అలాగే నూతన జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా సూపర్ గా ఉన్నారు.