English | Telugu

ఇలియానాతో వెంకటేష్ రొమాన్స్

ఇలియానాతో వెంకటేష్ రొమాన్స్ చేయనున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేష్ త్వరలో నలక నడుము గోవా భామ ఇలియానాతో రొమాన్స్ చేయనున్నారట. అంటే విక్టరీ వెంకటేష్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, నాగార్జున హీరోగా "సంతోషం, ప్రభాస్ హీరోగా "మిస్టర్ పర్ ఫెక్ట్"వంటి సూపర్ హిట్ చిత్రాలనందించిన ప్రతిభావంతుడైన యువ దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో ఒక చిత్రం రాబోతూందట.

విక్టరీ వెంకటేష్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించబోయే ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందించనున్నారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో గ్రాఫిక్స్ కి అత్యథిక ప్రాథాన్యత ఉంటుందని సమాచారం. గతంలో హీరో వెంకటేష్ "సాహసవీరుడు-సాగరకన్య", "దేవీపుత్రుడు" వంటి సోషియో ఫాంటసీ చిత్రాల్లో నటించారు. మరి ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో వెంకటేష్ ని ఎలా చూపిస్తారో దర్శకులు దశరథ్ వేచి చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.