English | Telugu

మారిషస్ లో రవితేజ, తాప్సి వీర

మారిషస్ లో రవితేజ, తాప్సి "వీర" చిత్రం షూటింగ్ ముగిసిందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న చిత్రం "వీర". రవితేజ హీరోగా నటిస్తున్న "వీర" చిత్రం షూటింగ్ ఇటీవల మారిషస్ లో జరిగింది. మారిషస్ లో హీరో రవితేజ, హీరోయిన్ తాప్సిల మీద ఒక డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరించారు. షబీనా ఖాన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయగా అయిదు రోజుల పాటు ఈ పాటను మారిషస్ లో చిత్రీకరించారు.

మారిషస్ నుండి రాగానే తను నటించబోయే బాలీవుడ్ చిత్రం "చష్మె బద్దూర్" చిత్రం చర్చల కోసం తాప్సి ముంబాయి వెళ్ళింది. త్వరలో "వీర" చిత్రం యూనిట్ యూనిట్ మరో డ్యూయెట్ చిత్రీకరణ కోసం వెళ్ళనుంది. ఈసారి హీరో రవితేజతో పాటు హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఈ డ్యూయెట్ లో ఆడి పాడబోతోంది. ఇక్కడ ఒక విషయాన్ని అనవసరమైనా చెప్పాలి. "మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రం తర్వాత కాజల్ అగర్వాల్, తాప్సి కలసి నటిస్తున్న రెండవ చిత్రం మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న "వీర". "వీర" చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.