English | Telugu

యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళి, హనీమూన్

యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళి, హనీమూన్ ఎక్కడనేది దాదాపు నిర్ణయమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళి శుభలేఖ చాలా విభిన్నంగా, సాంప్రదాయబద్ధంగా, పెద్దలను గౌరవించే విధంగా ఉండి, నందమూరి వంశ ప్రతిష్టను మరింత పెంచే విధంగా ఉందని పలువురు పలువిధాలుగా ప్రశంసిస్తున్నారు. యంగ్ టైగర్ యన్ టి ఆర్ వివాహం "మే" 5 వ తేదీన హైదరాబాద్ హైటెక్స్ లో, ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాసరావు ఏకైక కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీ ప్రణతితో జరుగనుంది. యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళిని చక్కని అచ్చ తెనుగు సాంప్రదాయ ప్రకారం చేసుకోవాలనుకుంటూంటే, ఆయన మామగారు తన ఏకైక కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరిపించాలని కోరుకుంటున్నారు.

యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళికి వివాహవేదిక ఖర్చు 18 కోట్లని తెలిసింది. యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళికి పెళ్ళి కుమార్తె ప్రణతి పెళ్ళిలో కట్టబోయే చీర ఖరీదు కేవలం యాభై లక్షల రూపాయలు మాత్రమేనని తెలిసింది.మరో చీర ఖరీదు అరవై లక్షల రూపాయలట. ఇక యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళి భోజనాల సంగతి చెప్పక్కరలేదు. యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళి భోజనం తిన్నవారు పది కాలాల పాటు చెప్పుకునే విధంగా భోజనాలుండబోతున్నాయని సమాచారం.

యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళిలో నందమూరి వారి స్వగ్రామం నిమ్మకూరుకు కూడా ప్రాథాన్యతనిస్తున్నారు. ఇక యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల పెళ్ళి తర్వాత హనీమూన్ మలేసియాలో జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. మలేసియాలోని బాలీ ఐలెండ్ లో యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల హనీమూన్ జరుగుతుందని అనుకుంటున్నారు. కాదు స్విట్జర్ల్యాండ్ లో యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల హనీమూన్ జరుగుతుందని ఫిలిం నగర్ లో ఒక వర్గం అంటూంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.