English | Telugu

వారణాసి రిలీజ్ డేట్.. ఒక్క పోస్టర్ తో సోషల్ మీడియా షేక్!

వారణాసి విడుదల తేదీ ప్రకటన
'పోకిరి', 'బాహుబలి-2' రిజల్ట్ రిపీట్ అవుతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'వారణాసి' (Varanasi). కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.

'వారణాసి' గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లోనే ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే భారీ సినిమా, అందునా రాజమౌళి సినిమా కావడంతో.. ఆ టైంకి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే నిన్న సడెన్ గా సినిమా పేరు లేకుండా "2027 ఏప్రిల్ 7న విడుదల" అంటూ వారణాసిలో కొన్ని పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇది వారణాసి మూవీ విడుదల తేదీనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే తాజాగా రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు మేకర్స్. 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇదిలా ఉంటే ఏప్రిల్ అనేది మహేష్, రాజమౌళి ఇద్దరికీ సెంటిమెంటే. మహేష్ నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'పోకిరి', రాజమౌళి డైరెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'బాహుబలి-2' ఏప్రిల్ లోనే విడుదలయ్యాయి. 'వారణాసి' కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.

Also Read: సిరై మూవీ రివ్యూ

మన శంకర వరప్రసాద్ గారు 50 రోజులు సాధ్యమేనా! ఆ హీరో ఫ్యాన్స్ ఏమంటున్నారు  

సెల్యులాయిడ్ వద్ద 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Varaprasad Garu)జోరు యదా రాజా, తదా ప్రజా అనే రీతిలో యదా మన శంకర వరప్రసాద్ గారు, తదా ప్రేక్షకులు లాగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 350 కోట్ల రూపాయల గ్రాస్ కి పైనే  సాధించి సరికొత్త రికార్డులని సృష్టించబోతున్నానని బాక్స్ ఆఫీస్ సాక్షిగా చెప్తున్నాడు. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్ లు లాభాల బాట పడుతుండటంతో పాటు  థియేటర్ ల ఆక్యుపెన్సీ  కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాకి అందని ద్రాక్షగా మారిన 50 రోజులని శంకర వర ప్రసాద్ ఎన్ని థియేటర్స్ లో జరుపుకుంటుందనే ఆసక్తి అందరిలో ఉంది.