English | Telugu
సుస్మిత కొణిదెల vs తేజస్విని నందమూరి
Updated : Jan 30, 2026
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-చిరంజీవి, బాలకృష్ణ నిర్ణయం ఏంటి
-కథలు వింటున్నారా!
సినిమా రంగంలో మేకర్ గా కొనసాగాలంటే ఎంతో అదృష్టం ఉండాలి.మరి సుదీర్ఘ కాలం నుంచి అగ్ర హీరోగా చెలామణి అవుతూ వస్తున్న తమ తండ్రి తోనే సినిమా నిర్మించాలంటే ఇంకెంత అదృష్టం ఉండాలి. అలాంటి అరుదైన అదృష్టాన్ని పొందిన వారు సుస్మిత(Sushmita KOnidela)తేజస్విని(Tejeswini Nandamuri). ఈ ఇద్దరు అఖండ 2(Akhanda 2),మన శంకర వరప్రసాద్ గారు(Mana shankara Varaprasad Garu)కి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు తమ తండ్రికి సంబంధించిన అన్ని విషయాలని దగ్గరుండి చూసుకున్నారు.పైగా తమ చిత్రాలని కాంప్రమైజ్ కానీ రీతిలో అత్యంత భారీ వ్యయంతో నిర్మించి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తమ కంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు.
మరి ఇప్పుడు ఆ ఇద్దరు తమ నెక్స్ట్ చిత్రాలని అంతే భారీగా తెరకెక్కించడం ఖాయం.మళ్ళీ చిరంజీవి,బాలకృష్ణ తోనే చేస్తారనుకుంటే ఆ ఇద్దరి నెక్స్ట్ చిత్రాలకి ప్రొడ్యూసర్స్ ఫిక్స్ అయి ఉన్నారు.వేరే బడా హీరోలతో చేస్తారేమో అనుకున్నా దాదాపుగా అందరు బడా హీరోలు బిజీగానే ఉన్న పరిస్థితి. దీంతో ఆ ఇద్దరు కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ తమ తండ్రి సినిమాతోనే వస్తారా అనే చర్చ అభిమానులతో పాటు చిత్ర వర్గాల్లో జరుగుతుంది. లేదా గ్యాప్ ఇవ్వకుండా బయట హీరో సినిమాలు కూడా చేస్తారేమో చూడాలి. ఎందుకంటే ఒక్కసారి మేకింగ్ లో అడుగుపెట్టి విజయాన్ని చూస్తే మాత్రం సినీ కళామతల్లి ఒడిలోనుంచి పక్కకు వెళ్ళడానికి చూడరు. ఈ క్రమంలో ఆ ఇద్దరు తమ తండ్రితో మళ్ళీ నిర్మించబోయే సినిమాకి సంబంధించిన కథలు వింటూ ఉంటారనే అనే మరో టాక్ కూడా వినపడుతుంది.
Also read:మన శంకర వరప్రసాద్ గారు 50 రోజులు సాధ్యమేనా! ఆ హీరో ఫ్యాన్స్ ఏమంటున్నారు
తేజశ్వని కొంత కాలం నుంచి బాలకృష్ణ చేస్తున్న అన్ని సినిమాలకి సంబంధించిన విషయాల్లో పూర్తిగా ఇన్ వాల్వ్ అవుతుంది. కథలు వినటం దగ్గర్నుంచి డేట్స్ కూడా తేజశ్వని చూస్తుందనేది టాక్. ఖైదీ నెంబర్ 150 నుంచి చిరంజీవి కి సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.