English | Telugu

2014లో హిట్టులేని స్టార్ హీరోలు

ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే తెలుగు చిత్రాలు సందడి చేశాయి. వాటిలో థియేటర్లలో నిలిచినవి మాత్రం వేళ్ళతో లెక్కపెట్టవచ్చు. మిగిలిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ అటూ ఇటుగా పాత చిత్రాల కథలను కాపీ కొట్టి.. కొత్త సీసాలో పాత సారాలా ఆడియెన్స్ ముందుకు వదులుతున్నారు దర్శకులు. ఈ చిత్రాలు చూసిన ప్రేక్షకులు కూడా వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా సినిమాలన్నీ భారీ డిజాస్టర్లుగా మారిపోతున్నాయి. మరి ఈ సంవత్సరం స్టార్ హీరోలు నటించిన చిత్రాల్లో ఎన్ని హిట్ కొట్టాయి? ఎన్ని ఫ్లాప్ అయ్యాయనేది ఓ సారి చూద్దాం.

2014 లో నందమూరి బాలయ్య, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్లుగా నిలిచాయి. 'సింహా' లాంటి భారీ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను మరోసారి బాలకృష్ణకు అదిరిపోయే హిట్ ను ఇచ్చాడు. 'లెజెండ్' సినిమా బాలయ్య కేరియార్లోనే హైయస్ట్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే బన్నీ, సురేందర్ రెడ్డి ఫస్ట్ టైం కాంబినేషన్ లో వచ్చిన 'రేసు గుర్రం' బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సంవత్సరం హైయస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఈ సంవత్సరం అక్కినేని కుటుంబం వచ్చిన మనం సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ సినిమా అక్కినేని కుటుంబానికి ఓ తీపి జ్ఞాపకంగా, మైలురాయిగా నిలిచిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన మొదటి తెలుగు సినిమాగా చరిత్రలో స్థానం పొందింది ‘మనం'.

ఇక మిగతా స్టార్ హీరోల విషయానికి వస్తే సూపర్ మహేష్ బాబు..ఈ సంవత్సరం అభిమానులను మరింత నిరాశపరిచిన హీరోగా చెప్పుకోవచ్చు. మహేష్ బాబు నటించిన వన్, ఆగడు చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాస్ లను తీసుకువచ్చాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు, గోవిందుడు అందరి వాడేలే చిత్రాలకి మంచి టాక్ వచ్చిన నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయాయి. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా అలాగే వుంది. ఆయన నటించిన 'రభస' ప్రేక్షకులను అలరించడంలో మరోసారి విఫలమైంది.

కామెడీ కింగ్ నరేష్, నానిలు కూడా ఈ సంవత్సరం ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయారు. నరేష్ మూడు సినిమాల్లో నటించగా..ఒకటి కూడా ప్రేక్షకులను నవ్వించలేకపోయింది. నాని నటించిన పైసా, ఆహా కళ్యాణం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అలాగే వరుణ్ సందేశ్, సాయికుమార్ తనయుడు ఆది నటించిన సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. మరి 2015 లోనైన ఈ హీరోలు ప్రేక్షకులను అలరించే సినిమాలు తీసి హిట్లు కొట్టాలని ఆశిద్దాం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .