English | Telugu

ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో అసలుసిసలు సినిమా పండుగ!

దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు మూడూ ప్రేక్షకులను మెప్పించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శిమవుతున్నాయి. గత వారం విడుదలైన 'మట్కా', 'కంగువా' మాత్రం దారుణంగా నిరాశపరిచాయి. ఈ క్రమంలో ఈ వారం విడుదల కానున్న సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పడింది. ఈ నవంబర్ 22న ఏకంగా అర డజను సినిమాలు విడుదలవుతున్న్నాయి.

విశ్వక్‌సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'మెకానిక్ రాకీ'. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.

అశోక్‌ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించాడు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.

సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జీబ్రా'. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు.

వీటితో పాటు 'రోటి కపడా రొమాన్స్', రాకింగ్ రాకేష్ 'కేశవ చంద్ర రమావత్' (కేసీఆర్), సన్నీ లియోన్ 'మందిర' సినిమాలు కూడా నవంబర్ 22న విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీలోనూ ఈవారం సినిమాలు, సిరీస్ ల సందడి బాగానే ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌:
వాండరూస్‌ 2 (యానిమేషన్‌ సిరీస్‌) - నవంబర్ 18
జాంబీ వర్స్‌ (కొరియన్‌ సిరీస్‌) - నవంబర్ 19
ఎ మ్యాన్‌ ఆన్‌ ది ఇన్‌ సైడ్‌ (హాలీవుడ్ సిరీస్‌) - నవంబర్ 21
జాయ్‌ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22
పోకెమాన్‌ హారిజాన్స్‌ ది సిరీస్‌ 4 (యానిమేషన్‌) - నవంబర్ 22
స్పెల్‌బౌండ్‌ (యానిమేషన్‌ మూవీ) - నవంబర్ 22
ది పియానో లెసన్‌ (హాలీవుడ్‌ మూవీ) - నవంబర్ 22
యే కాలీ కాలీ ఆంఖే 2 (హిందీ సిరీస్‌) - నవంబర్ 22

డిస్నీ+హాట్‌స్టార్‌:
కిష్కిందకాండమ్‌ (మలయాళం/తెలుగు) - నవంబర్ 19
ఇంటీరియర్‌ చైనా టౌన్‌ (వెబ్‌ సిరీస్‌) - నవంబర్ 19
ఏలియన్‌ రొమ్యులస్‌ (హాలీవుడ్‌ మూవీ) - నవంబర్ 21
అవుట్‌ ఆఫ్‌ మై మైండ్‌ (హాలీవుడ్‌ మూవీ) - నవంబర్ 22

జియో సినిమా:
బ్యాక్‌ టు బ్లాక్‌ (హాలీవుడ్‌) - నవంబర్ 17
డ్యూన్‌: ప్రొఫెసి (వెబ్‌సిరీస్‌) - నవంబర్ 18
హరోల్డ్‌ అండ్‌ ది పర్పుల్‌ క్రేయాన్‌ (హాలీవుడ్) - నవంబర్ 23

అమెజాన్ ప్రైమ్:
క్యాంపస్ బీట్స్-2 (హిందీ సిరీస్) - నవంబర్ 20

ఈటీవీ విన్:
ఐ హేట్ లవ్ (తెలుగు) - నవంబర్ 21
రేపటి వెలుగు (తెలుగు) - నవంబర్ 21

ఆపిల్‌ టీవీ ప్లస్‌:
బ్లిట్జ్‌ (హాలీవుడ్‌ మూవీ) - నవంబర్ 22

బుక్‌ మై షో:
ది గర్ల్‌ ఇన్‌ ది ట్రంక్‌ (హాలీవుడ్‌) - నవంబర్ 22

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .