English | Telugu

యన్ టి ఆర్ బోయపాటి సినిమా న్యూస్

యన్ టి ఆర్, బోయపాటి సినిమా న్యూస్ వివరాలిలా ఉన్నాయి. క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై,యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, హేట్రిక్ విజయాలతో ఊపు మీదున్న బోయపాటి శీను దర్శకత్వంలో, కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం"చురకత్తి" (ఈ టైటిల్ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు). ఈ యన్ టి ఆర్, బోయపాటి సినిమా సినిమా షూటింగ్ ప్రస్తుతం షంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో, ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో యాక్షన్ సీన్ల చిత్రీకరణలో ఉంది.

దీనికి ముందు హీరో యన్ టి ఆర్, హీరోయిన్ శృతి హాసన్ లపై ఒక రొమాంటిక్‍ సాంగ్ ని చిత్రీకరించారు. అలాగే విలన్ రాహుల్ దేవ్, హీరో యన్ టి ఆర్ లపై కూడా యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. అలాగే హీరో యన్ టి ఆర్, కమెడియన్స్ కోట శ్రీనివాసరావు, ఆలీ, బ్రహ్మానందం తదితరులపై కడుపుబ్బ నవ్వించే హాస్యసన్నివేశాలను కూడా చిత్రీకరించారు. యన్ టి ఆర్, బోయపాటి సినిమాకి కథ, మాటలు యమ్.రత్నం వ్రాస్తూండగా, ఆర్ట్ ఆనందసాయి, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీని ఆర్థర్ విల్సన్ నిర్వహిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.