English | Telugu

ఈగ ఒక ప్రత్యేకమైన సినిమా - రాజమౌళి

"ఈగ" ఒక ప్రత్యేకమైన సినిమా అని రాజమౌళి అంటున్నారు. వివరాల్లోకి వెళితే "అష్టచమ్మా, అలా మొదలైంది" సినిమాల ఫేం నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా, అపజయమెరుగని యువ దర్శకుడు యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం "ఈగ". "ఈగ" సినిమాలో గ్రాఫిక్స్ కి అత్యధిక ప్రాథాన్యత ఉన్నదనీ, అందుకోసం దాదాపు అయిదు కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని సమాచారం.

అయితే కొందరు సినీ పక్షులు ఈ "ఈగ" సినిమా హాలీవుడ్లో వచ్చిన "ఫ్లై, ఫ్లై-2" సినిమాలకు కాపీ అని ప్రచారం చేస్తున్నారు. అందుకు స్పందిస్తూ ఈ "ఈగ" చిత్ర దర్శకుడు రాజమౌళి "ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. ఏ హాలీవుడ్ సినిమాకీ కాపీ కాదు. చాలా మంది అనుకుంటున్నట్లు "ఫ్లై, ఫ్లై-2" సినిమాలకు ఇది కాపీ కాదు. ఆ రెండు సినిమాలు హారర్ చిత్రాలు. కానీ "ఈగ" ఒక ఫాంటసీతో కూడిన కామెడీ చిత్రం. అందుకని వాటికీ "ఈగ" సినిమాకీ అస్సలు సంబంధమే ఉండదు" అని అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.