English | Telugu
సినీ పరిశ్రమపై బంద్ ప్రభావం
Updated : Feb 23, 2011
ఆ అంటే బంద్ ఊ అంటే బంద్ అంటూ చేస్తున్న ఈ బందుల వల్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది.ఈ బంద్ ల వల్ల రవాణా సౌకర్యాల్లేక అన్ని వ్యాపార సంస్థలూ, కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయనే చెప్పొచ్చు.అలాగే ఈ రెండు రోజుల బంద్ ప్రభావం మన తెలుగు సినీ పరిశ్రమ మీద కూడా భారీగానే పడింది.మన సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్టుల కార్మికులూ దీని ప్రభావానికి గురయ్యారు.అన్ని స్టుడియోలూ, అన్ని రికార్డింగ్ థియేటర్లూ,అన్ని సినిమా థియేటర్లూ ఈ రెండు రోజుల బంద్ పుణ్యమాని మూతపడ్డాయి.ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలోని దాదాపు 500 థియేటర్లు ఈ రెండు రోజులూ మూతపడ్డాయి.భారీ బడ్జెట్ చిత్రాలైన "శక్తి, తీన్ మార్, దూకుడు, మిస్టర్ పర్ ఫెక్ట్"వంటి ద్దాపు ముప్పై చిత్రాల షూటింగ్ ఈ రెండు రోజుల బంద్ వల్ల కుంటుపడింది.ఈ రెఅండు రోజుల బంద్ వల్ల సినీ పరిశ్రమకు 5 కోట్ల నష్టం వాటిల్లిందని సినీ వర్గాలంటున్నాయి.