English | Telugu

యన్ టి ఆర్, రామ్ చరణ్ ఒకే కారులో

యన్ టి ఆర్, రామ్ చరణ్ ఒకే కారులో కలసి తిరుగుతూంటారనటానికి ఈ క్రింద కనపడే ఫొటోనే నిదర్శనం. జునియర్ యన్ టి ఆర్ డ్రైవింగ్ సీటులో ఉంటే, రామ్ చరణ్ పక్కనే కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరికీ పడదనీ, వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు చాలానే ఉన్నాయనీ అందరూ...అంటే సగటు ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు.

కానీ అది నిజం కాదనీ, వీళ్ళిద్దరూ కలసి ఇలా హ్యాపీగా పార్టీలూ గట్రా చేసుకుంటూంటారనీ, చాలా స్నేహంగా ఇలా కలసి సర్దాగా కాలం గడుపుతారనీ, వాళ్ళిద్దరి మధ్యా ఉన్నది వృత్తి రీత్యా ఉండే ఆరోగ్యకరమైన పోటీయేననీ ఈ కనపడే ఫొటో చూస్తే అర్థమవుతుంది కదూ... అయితే బయట వీళ్ళిద్దరి అభిమానులకూ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటూంది. వీళ్ళిద్దరి అభిమానులేమో అమాయకంగా కొట్టుకుంటూ ఉంటారు. కానీ అసలు నిజమేమిటంటే వీళ్ళిద్దరూ చక్కని స్నేహితులు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.