English | Telugu

పిల్లల కోసం ప్రియా ఆనంద్

పిల్లల కోసం ప్రియా ఆనంద్ అనగానే అపార్థం చేసుకోకండి. ఆమెకింకా పెళ్ళే కాలేదు. వివరాల్లోకి వెళితే ఆ మధ్య రానా హీరోగా నటించిన తొలి చిత్రం" లీడర్" లో ఒక చక్కని పాత్రలో నటించిన ప్రియా ఆనంద్ ప్రస్తుతం సిద్ధార్థ హీరోగా, నిత్య మీనన్ హిరోయిన్ గా నటిస్తున్న "180" సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తూంది. ఇంతకీ విషయమేమిటంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తల్లిదండ్రులు లేని పిల్లలను కాపాడే పనిలో భాగంగా "సేవ్ చిల్డ్రన్" అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా, అలాగే బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుంది.

ఆ పనిలో భాగంగా ఆమె తమిళనాడులో సునామీలో తమ తల్లిదమడ్రులను పోగొట్టుకుని అనాథలుగా మిగిలిన పిల్లలను కొందరిని కలిసింది ప్రియా ఆనంద్. ఆ పసిపిల్లల అనుభవాలను, వారి మనోభావాలను తెలుసుకున్న ప్రియా ఆనంద్ చాలా ఆశ్చర్యపోయిందట. సేవ్ ది చిల్డ్రన్ ఆర్గనైజేషన్ వారు నడుపుతున్న ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలెప్ మెంట్ స్కీమ్ సెంటర్ మరకణ్ణన్ కు వెళ్ళి అక్కడున్న పిల్లలతో పాటు భోజనంచేసి వారితో గడిపిందట ప్రియా ఆనంద్. మంచిపని చేస్తున్న ప్రియా ఆనంద్ ని తెలుగువన్ అభినందిస్తూంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.