English | Telugu
సినిమాలకు ఆన్ లైన్ సెన్సారింగ్
Updated : Jun 15, 2011
సినిమాలకు ఆన్ లైన్ సెన్సారింగ్ ఏర్పాటు చేయాలని సి.బి.యఫ్.సి. (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) సంస్థ చైర్మన్ లిలా శాంసన్ ఆలోచిస్తున్నారట. వివరాలలోకి వెళితే దేశవ్యాప్తంగా చలన చిత్రాలకు ఒకే విధమైన సెన్సారు సర్టిఫికేషన్ విధానం ఉండాలన్న ఆలోచనకు ప్రతి రూపమే ఈ ఆన్ లైన్ సెన్సారింగ్ వ్యవస్థ. చలన చిత్ర సెన్సారింగ్ లో ట్రాన్స్ పరెన్సీని చూపించటానికే ఈ ఆన్ లైన్ సెన్సారింగ్ ఏర్పాటు చేయాలని సి.బి.యఫ్.సి. (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) సంస్థ చైర్మన్ లిలా శాంసన్ ఒక వెబ్ సైట్ ను రూపొందిస్తున్నారట.
ఇక్కడ సెన్సారు అయిన సినిమాని ఇక ఎవరూ, ఎక్కడా అభ్యంతరపెట్టటానికి వీల్లేకుండా ఈ ఆన్ లైన్ సెన్సారింగ్ పద్ధతిని రూపొందిస్తున్నారట. దీనికి అనుగుణంగా 2010 సినిమాటోగ్రఫీ చట్టంలో కూడా కొన్ని మార్పులు చెయ్యాల్సి ఉందట. ఇందుకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత యాష్ చోప్రా సి.బి.యఫ్.సి. (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) సంస్థ చైర్మన్ లిలాశాంసన్ కు కొన్ని సూచనలూ, సలహాలూ ఇస్తున్నారట. ఇన్ ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఎడిషనల్ సెక్రెటరీ రాజీవ్ ఠక్రు సెన్సారింగ్ లో సీన్లకు కటింగ్స్ ఇవ్వకుండా ఆ సినిమా కంటెంట్ ని బట్టి సర్టిఫికేట్ ఇవ్వాలని అంటున్నారు.