English | Telugu

హీరోలూ.. కాస్త కింద‌కు దిగండి ప్లీజ్‌

తెలుగు చిత్ర‌సీమ‌లో నిర్మాత ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. ఏ నిర్మాత క‌ళ్ల‌లోనూ ఆనందం లేదు. క‌ష్టాల క‌న్నీళ్లు త‌ప్ప‌. సినిమా మొద‌లెట్ట‌డం వ‌ర‌కే త‌న చేతుల్లో ఉంది. సినిమా పూర్తి చేయ‌డం, ఆ సినిమాని విడుద‌ల చేయ‌డం అన్నీ దైవాదీన‌మే. చిన్నా చిత‌కా సినిమాల‌కే కాదు... బ‌డా స్టార్లున్న సినిమాల‌దీ ఇదే పరిస్థితి. త‌డిసి మోపెడ‌వుతున్న బ‌డ్జెట్‌ని ఎలా కంట్రోల్ చేయాలో నిర్మాత‌ల‌కు పాలుపోవ‌డం లేదు. అందులో భాగంగా బ‌డ్జెట్ కంట్రోల్ విష‌న్ మొద‌లెట్టారు కొంత‌మంది నిర్మాత‌లు. ఛాన‌ళ్లు, వార్తా ప‌త్రిక‌ల‌కు యాడ్ క‌టింగ్ చేయ‌డం.. ఇందులో భాగ‌మే. `హీరోల పారితోషికాలు త‌గ్గించ‌కుండా.. మా మీద ప‌డ్డారేంటి?` అని మీడియా గోల పెడుతుంది. త్వ‌ర‌లో హీరోలూ త‌మ పారితోషికం త‌గ్గించుకొంటారు.. ఆ దిశ గా ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాం అని నిర్మాత‌లు చెబుతున్నారు. మ‌రి అది సాధ్య‌మేనా, మ‌న హీరోలు దిగి వ‌స్తారా? నిర్మాత‌ల క‌న్నీళ్లు తుడుస్తారా?

మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీ, ప్ర‌భాస్ ఇలా స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు ప‌రిశ్ర‌మ‌లో. వెంకీ, నాగ్‌, బాల‌య్య‌.. వీళ్లంతా సీనియ‌ర్లు. ర‌వితేజ‌, గోపీచంద్‌, నాగ‌చైతన్య‌.. వీళ్లంతా మిడిల్ హీరోలు. ఎవ‌రి రేంజుకి త‌గిన పారితోషికం వాళ్లు అందుకొంటున్నారు. మ‌హేష్ బాబు ఓ సినిమాకి రూ.18 కోట్ల వ‌ర‌కూ పారితోషికం తీసుకొంటాడ‌ని టాక్‌. ప‌వ‌న్ కూడా ఇంచుమించుగా అంతే. ఎన్టీఆర్ ప‌ది కోట్ల‌కు త‌గ్గ‌డు. చ‌ర‌ణ్‌, బ‌న్నీ.. వీళ్లంతా ఏడెనిమిది కోట్ల‌కు తూగుతారు. ప్ర‌భాస్ బాహుబ‌లి కోసం రూ.15 కోట్లు తీసుకొన్నాడ‌ట‌. ఈ అంకెలు వింటుంటే గుండెలు గుభేలు మంటున్నాయి క‌దూ. హీరోల స్టార్ డ‌మ్‌, వాళ్ల ఫ్యాన్ ఫాలోయింగ్‌, క్రేజ్‌ని బ‌ట్టే పారితోషికాలు ఉంటాయ్‌. కాద‌న‌లేం. కానీ హీరోకే ప‌ది నుంచి ఇర‌వై కోట్ల వ‌ర‌కూ పారితోషికం చ‌దివించుకొంటే.. హీరోయిన్ల‌కు ఎంతివ్వాలి? ద‌ర్శ‌కుడికి ఎంతిచ్చుకోవాలి? సినిమా ఎంత‌టిలో పూర్తి చేసుకోవాలి? ఓ స్టార్ హీరో సినిమా అంటే పారితోషికాల రూపంలోనే దాదాపుగా రూ.30 కోట్ల వ‌ర‌కూ భ‌రించాల్సివ‌స్తుంది. ఓ ఇర‌వైలో సినిమా పూర్తి చేసినా.. మొత్తానికి రూ.50 కోట్లు అవుతోంది. సినిమా హిట్ట‌యితే ఫ‌ర్వాలేదు. కానీ పోతే నిర్మాత ప‌రిస్థితి ఏమిటి? హిట్ట‌యిన సినిమాకే పెట్టుబ‌డితిరిగి రావ‌డం లేదు. ఫ్లాప్ టాక్ వ‌స్తే ఆ నిర్మాత రోడ్డు మీద ప‌డాల్సిందే.

ర‌జ‌నీకాంత్ సినిమా లింగ‌... మ‌న నిర్మాత‌ల క‌ళ్లూ తెరిపించింది. ఈ సినిమా దాదాపు వంద కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌య్యింది. అందులో ర‌జ‌నీ పారితోషిక‌మే దాదాపుగా రూ.40 కోట్లు. సినిమా బాగా ఆడితే వంద‌కు వంద వ‌చ్చేవే. కానీ అట్ట‌ర్ ఫ్టాప్ అయ్యింది. దాంతో.. రూ.30 కోట్ల‌కంటే ఎక్కువ వ‌సూలు చేయ‌లేక‌పోయింది. అంతే... ఈ సినిమాని కొన్న బ‌య్య‌ర్లు ఆత్మ‌హత్య‌ల వ‌ర‌కూ వెళ్లారు. ర‌జ‌నీకాంత్ దిగి వ‌చ్చి పారితోషికం లోంచి కొంత మొత్తం తిరిగి ఇచ్చేంత వ‌ర‌కూ బ‌య్య‌ర్లు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ ప‌రిస్థితి తెలుగునాట కూడా ఉంది. కానీ ఓ బ‌య్య‌రూ నోరు మెద‌ప‌లేక లోప‌ల లోప‌ల కుమిలిపోతున్నాడు. నిర్మాత ఈ న‌ష్టాల్ని క‌వ‌ర్ చేయ‌లేక‌.. సినిమాల దూర‌మ‌వుతున్నాడు. బ‌డ్జెట్ కంట్రోల్ అయితే త‌ప్ప‌.. ఈ ప‌రిస్థితి అదుపులోకి రాదు. అలా రావాలంటే.. ముందు హీరోలు త‌మ పారితోషికాలు త‌గ్గించుకోవాలి. కానీ అదే జ‌రిగే విష‌య‌మేనా??

`నా పారితోషికంలో రావాల్సిన బాకీ వ‌స్తేగానీ... డ‌బ్బింగ్ చెప్ప‌ను` అని ఈమ‌ధ్య మొండికేశాడు ఓ స్టార్ హీరో. అలాంట‌ప్పుడు పారితోషికాలు ఎక్క‌డ త‌గ్గించుకొంటారు? ఓ సినిమా హిట్ట‌యితే త‌మ‌వ‌ల్లే ఆడింది అనే భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్నారు హీరోలు. అందుకే హిట్ కొట్ట‌గానే పారితోషికాలు పెంచేస్తుంటారు. అలాంట‌ప్పుడు ఎందుకు త‌గ్గించుకొంటారు? అందుకే నిర్మాత‌లు కూడా ఓ మ‌ధ్యేమార్గం ఆలోచించాలి. సినిమా తీద్దాం.. లాభాలు పంచుకొందాం అంటూ ఓ ఒప్పందం చేసుకొంటే త‌ప్ప పారితోషికాల భారం త‌గ్గ‌దు. సినిమాలో త‌న పెట్టుబ‌డీ ఉంటే... మ‌రింత జాగ్ర‌త్త‌గా మ‌సులు కొంటాడు హీరో. మంచి సినిమా తీయ‌డానికి మ‌రింత శ్ర‌ద్ధ‌గా ప‌నిచేస్తాడు. ప్ర‌స్తుతం నిర్మాత‌ల ఆలోచ‌నా అదే. క‌ల‌సి సినిమా తీద్దాం... లాభాలు పంచుకొందాం అనే కాన్సెప్ట్ హీరోల ముందు ఉంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రి హీరోలేం చేస్తారో చూడాలి. నిర్మాత‌ల్ని ఆదుకొనేందుకు హీరోలు ఓ మెట్టు దిగినా త‌ప్పులేదు. మ‌రి ఆ ఆడుగు వీరిలో ఎవ‌రేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.