English | Telugu
ఫేడవుట్ దశలో అరుదైన అవకాశాలు..!
Updated : Feb 18, 2023
టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమనా. ఈమె ప్రస్తుతం ఎంసీఏ ఫేమ్, బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో ఉంది అంటున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే తమన్నా ఆయనతో తరచు కనిపిస్తూ వార్తల్లో నిలుస్తోంది. 18 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో సక్సెస్ లు, మర్చిపోలేని విజయాలను అందుకుంది తమన్నా. హిందీ, తమిళం, తెలుగు భాషలో క్రేజీ స్టార్స్ తో నటించింది.
అయితే గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటోంది తమన్నా. ఈమె టైం అయిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎఫ్ 3 కొంతలో కొంత పర్వాలేదు. యంగ్ హీరోయిన్ల హవా కొనసాగుతున్న దశలో ఈమె పనైపోయిందని పలువురు భావించారు. కానీ ఈమె తెలివిగా ఎఫ్ 3 తరహాలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి వారి సినిమాలను ఎంచుకొంటోంది. దాంతో ఈమెకు క్రేజీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా ఈమె అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో భోలా శంకర్ లో మెగాస్టార్‌తో జోడి కడుతోంది. సైరా నరసింహారెడ్డిలో తొలిసారి చిరుకు జోడిగా తమన్నా కనిపించింది. ఆమెకు మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో తమన్నాతో కలిసి రజనీ నటిస్తూ ఉన్నారు. ఇలా తమన్నా తొలిసారి రజనీకి జోడిగా కనిపించబోతోంది.
ప్రతి హీరోయిన్ తమ కెరీర్లో ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించాలని ఆశపడతారు. కానీ అందరికీ ఆ అవకాశం దక్కదు. తమన్నాకు మాత్రం అవకాశం లభించింది. ఇది అరుదైన అవకాశం అని చెప్పాలి. దాంతో ఈమె చాలా ఆనందంగా ఉంది.