English | Telugu
మొదటి సినిమా హిట్.. రెండో సినిమా లేదేందుకు?!
Updated : Feb 18, 2023
బుల్లితెర యాంకర్లలో అందరికంటే ముందుగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. మేల్ యాంకర్స్‌లో ఈయననుకొట్టే వారెవరు లేరు. యాంకర్ గా సూపర్ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈయన మొదట్లో చిన్నా చితకా పాత్రలో వెండితెరపై కనిపించారు. 2021లో హీరోగా మారారు. మున్నా దర్శకత్వంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సంగీతపరంగా ఈ చిత్రం బాగా హిట్ అయింది. ఇందులోని "నీలి నీలి ఆకాశం" పాట ఇప్పటికీ ప్రేక్షకుల హార్ట్ ఫేవరెట్.
ఆ సినిమా హిట్ అయ్యాక ప్రదీప్ మరో సినిమా చేస్తాడనుకున్నారు. కానీ ఆయన చేయలేదు. ఎందుకు వచ్చిన గొడవనుకున్నాడో లేక యాంకరింగే బాగుందనుకున్నాడో తెలియదు.. రెండో సినిమాకు ఇంత దాకా ముహూర్తం పెట్టలేదు. సరైన కథ దొరకడం లేదా లేదా హీరోగా చేయకూడదని డిసైడ్ అయ్యాడా అనేది అర్థం కావడం లేదు. మొదటి సినిమాతో హిట్టు కొట్టాడు కాబట్టి ఆడియన్స్ ప్రదీప్ మాచిరాజుని హీరోగా అంగీకరించారని స్పష్టం అవుతోంది. సుడిగాలి సుధీర్ లాగా ప్రదీప్ దూకుడు చూపించలేకపోతున్నాడు. ఎందువల్ల అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మొదటి సినిమా ఆడకపోతే ఎవరైనా మరో సినిమా అంటే ఆలోచిస్తారు. కానీ మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నా కూడా ప్రదీప్ మాచిరాజు మౌనం వహిస్తున్నాడు. ముందుగానే కమిట్ అయిన షోలు దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని అతని ఫీలింగ్ అంటున్నారు కొందరు. అందుకే వెండితెరను కాదని బుల్లితెరని నమ్ముకొని ఉన్నాడని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒక్క సినిమాతో ఆగిపోవడం మాత్రం ఆయన అభిమానుల్ని కాస్త ఇబ్బంది పెడుతోంది. మరలా ఆయన సినిమా చేస్తే బుల్లితెర ఫ్యాన్స్ ఆయనను ఆదరించడానికి రెడీగా ఉన్నారు. బహుశా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' వంటి కథ మరోటి రాలేదేమో...!? ఏది ఏమైనా బుల్లితెరపై ఇతడిని ఇష్టపడిన ఆడియన్స్ కూడా హీరోగా కూడా అతని ప్రమోట్ చేసేందుకు రెడీగా ఉన్నారు అని మాత్రం అర్థం అవుతుంది.