English | Telugu

పవర్ సోప్స్ పై తమన్నా కేస్

పవర్ సోప్స్ పై తమన్నా కేస్ వేసిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే డిమాండ్ లో ఉన్న సినిమా హీరోలు, హీరోయిన్లు యడ్వర్టైజ్ మెంట్లలో నటించటం చాలా సహజమైన విషయమే. అలాగే ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా కూడా చాలా యడ్వర్టైజ్ మెంట్లలో నటిస్తూంది. అందుకు తమన్నాకు ఆయా కంపెనీలు వ్రాసుకున్న ఎగ్రిమెంట్ల ప్రకారం ఇవ్వవలసిన మొత్తాన్ని ఇస్తూంటారు. ఆ ఎగ్రిమేంట్ సమయం గనక పూర్తయితే ఆ యా కంపెనీలు ఆ యా సినీ ప్రముఖుల ఫొటోలను తమ వస్తువుల ప్రకటనల్లో వాడుకోరాదు.

తమన్నా భాటియా పవర్ సోప్స్ అనే కంపెనీకి అక్టోబర్ 7 వ తేదీ 2008 లో ఎగ్రిమెంట్ చేసింది. కానీ ఆ ఎగ్రిమెంట్ పూర్తయిన తర్వాత కూడా తన ఫొటోను ఆ కంపెనీ ప్రకటనల్లో వాడుతున్నందుకు వారికామె నోటీస్ పంపింది. కానీ దానికి ఆ సదరు కంపెనీ వారు ప్రతిస్పందించకుండా తమన్నా ఫొటోని ఇంకా తమ ప్రకటనల్లో వాడుతూండటంతో ఆమె కోర్టుకెళ్ళి, కోటి రూపాయలు తనకు నష్టపరిహారంగా ఇప్పించాల్సిందిగా కోరింది.

తమన్నా వేసిన కేసుని పరిశీలించేందుకు కోర్టు వారు 2011 జూన్ 8 వ తేదీ వరకూ వాయిదా వేస్తూ, సదరు పవర్ సోప్స్ కంపెనీకి దాని ఏజన్సీ జె అండ్ డి కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కీ తమన్నా ఫొటోలను వాడరాదని ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనా తమన్నా భాటియా మామూలు మనిషి కాదండోయ్... తేడాలొస్తే తాట తీస్తుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.