English | Telugu

రామ్ కందిరీగలో శ్రియ ఐటం సాంగ్

రామ్ "కందిరీగ" చిత్రంలో ప్రముఖ హీరోయిన్ శ్రియ ఒక ఐటం సాంగ్ లో నటించనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, యువ హీరో రామ్ హీరోగా, అందాల దేశముదురు హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం" కందిరీగ".

రామ్ "కందిరీగ" చిత్రంలో ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్ ఒక ఐటం సాంగ్ లో నటించనుందట. శ్రియకు తెలుగులో సినిమాలు లేకపోవటం వలన ఇలా ఐటం సాంగ్స్ లో అయినా నటిస్తూ తన ఉనికిని చాటుకుంటూ ఉంటే ఏదోక సినిమా లో తనకు హీరోయిన్ గా అవకాశం దక్కితే మళ్ళీ పూర్వవైభవం పొందచ్చనే ఆలోచనలో ఉందట.

గతంలో కూడా రామ్ హీరోగా నటించిన తొలి చిత్రం "దేవదాసు" చిత్రంలో కూడా శ్రియ ఒక ఐటం సాంగ్ లో నటించింది. అందుకే సెంటిమెంట్ పరంగా మళ్ళీ రామ్ హీరోగా నటిస్తున్న ఈ "కందిరీగ" చిత్రంలో శ్రియ ఐటం సాంగ్ లో నటిస్తూందని సమాచారం. ఈ రామ్ "కందిరీగ" చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తూండగా, ఆండ్ర్యూ సినిమాటోగ్రఫీని, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.