English | Telugu
‘అవును' రవిబాబుతో రానా
Updated : Jul 10, 2014
కొత్త తరహా కామెడీ, థ్రిల్లర్ చిత్రాలను అందించే రవిబాబు రీసెంట్ చిత్రం ‘లడ్డూబాబు’ పెద్దగా విజయం సాధించలేకపోయింది. ప్రయోగాలకు విజయాలతో, పరాజయాలతో పనిలేదు అని నమ్మే ఆర్ జీవి బాటలో రవిబాబు కూడా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ లో మరో చిత్రాన్ని
నిర్మించడానికి రవిబాబు సిద్ధమవుతున్నాడని ఫిలింనగర్ భోగట్టా. అయితే కొత్త హీరోలు, లేదా అల్లరి నరేష్ తో పనిచేసే రఘుబాబు ఈ సారి రానాతో సినిమా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమా స్క్రిప్టు కూడా ఎంతో ప్రయోగాత్మకంగా మలుస్తున్నారట రవిబాబు. కామెడీ, హార్రర్ చిత్రాలకు సమాన ప్రాధాన్యతనిచ్చే రవిబాబు ‘అవును' చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందించాలనుకుంటున్నారట. ఏమైనా సినిమా సక్సెస్ విషయం ఎలా వున్నా ఈ తరహా ప్రయోగాలను స్వాగతించే నిర్మాతలు దొరికితే పరిశ్రమకు కొంత కొత్తదనం చేరువవుతుందనేది వాస్తవం.