English | Telugu

180 కి సిద్ధార్థ డబ్బింగ్ పూర్తి

"180" కి సిద్ధార్థ డబ్బింగ్ పూర్తిచేశాడట. వివరాల్లోకి వెళితే సత్యం సినిమా పతాకంపై, సిద్ధార్థ్ హీరోగా, నిత్య మీనన్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా, కొన్నివందల యాడ్ ఫిల్ములకు దర్శకత్వం వహించిన జయేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"180". ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రం షూటింగ్ యు.యస్., యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లో జరిగింది. ఈ 180" సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఈ దిశలో భాగంగా హీరో సిద్ధార్థ ఇటీవల ఈ "180" చిత్రంలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పటం పూర్తిచేశాడట. రేపు గురించి ఆలోచించకుండా నేటి జీవితాన్నే ఎంజాయ్ చేసే నేటితరం యువకుని పాత్రలో సిద్ధార్థ చక్కగా నటించాడట. ఈ "180" చిత్రానికి శరత్ సంగీతాన్నందించారు. వనమాలి ఈ "180" చిత్రంలోని పాటలన్నీ వ్రాయటం విశేషం. ఈ మూవీకి సినిమాటోగ్రఫీని కె.టి.బాలసుబ్రహ్మణ్యం నిర్వహిస్తున్నారు. ఈ "180" సినిమాని ప్రయోగాత్మకంగా "రెడ్" కెమెరాతో చిత్రీకరించారు. ఈ "180" సినిమాకి తమిళంలో "పుదం పుదు కాదలై" అన్న పేరుని నిర్ణయించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.