English | Telugu

హాస్పిటల్లో ఇలియానా

అందాల నలక నడుము గోవా భామ ఇలియానా డి క్రూజ్ హాస్పిటల్ పాలైందట. వివరాల్లోకి వెళితే వైవియస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన "దేవదాసు" చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ప్రవేశించి, పూరీ జగన్నాథ్ "పోకిరి" సినిమా వల్ల అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుని, ప్రస్తుతం ఒక సినిమాలో నటించటానికి రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. అలాంటి ఇలియానా ఈ మధ్య యన్ టి ఆర్ తో "శక్తి", రానాతో "నేను-నారాక్షసి" చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

ఈ రెండు సినిమాల్లో విశ్రాంతి లేకుండా నటించటం వల్ల శారీరకంగా ఇలియానా బాగా అలసిపోయిందట. ఇలియానా అంత కష్టపడి నటించిన ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద సూపర్ ఫ్లాపయ్యాయి. హాస్పిటల్లో చేరిన ఇలియానాకు పూర్తిగా విశ్రాంతి అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఇలియానా తమిళంలో శంకర్ దర్శకత్వంలోని " 3 ఇడియట్స్" సినిమాలో నటిస్తూంది. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా నటించబోయే చిత్రంలో హీరోయిన్ గా నటించటానికి ఇలియానా అంగీకరించింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.