English | Telugu

పవన్ గబ్బర్ సింగ్ లో శృతి హాసన్

పవన్ "గబ్బర్ సింగ్" లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, "షాక్, మిరపకాయ్" చిత్రాల ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న సినిమా " గబ్బర్ సింగ్". ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమాలో ముందుగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ అనుకున్నారు. కానీ ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమాకి ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవటం వల్ల, ఆమె స్థానంలో శృతి హాసన్ ని ఎన్నిక చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఆగస్టు నెల నుండి సెట్స్ మీదకు రానున్న ఈ పవన్ "గబ్బర్ సింగ్" సినిమాకి యువసంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ "గబ్బర్ సింగ్" సినిమాకి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా సూపర్ హిట్టయిన "దబాంగ్" సినిమా మాతృక అన్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.