English | Telugu

అందాల సుందరికి ప్రమాదం తప్పింది

బాలీవుడ్ అందాల సుందరి శిల్పాశెట్టి రోడ్డు ప్రమాదం నుంచి బయటపడింది. ఈ రోజు ఆమె తన భర్తతో కలిసి ఓ స్టోర్‌ని ప్రారంభించేందుకు పంజాబ్‌లోని జలంధర్ నుంచి అమృత్‌సర్‌కు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద ఓ కారు సడన్ గా వీరి సెక్యూరిటి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు కానీ కారు అద్దాలు మాత్రం పూర్తిగా ధ్వంసంమయ్యాయి. వెంటనే శిల్పాశెట్టి సెక్యూరిటి గార్డులు ఆ కారు డ్రైవర్ తో గొడవ పడగా, అప్పుడు శిల్పాశెట్టి అక్కడి నుండి వెళ్లిపోయింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీస్ ఇరువర్గాలతో మాట్లాడి ఈ కేసుకు ముగింపు పలికారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.