English | Telugu

రిచెస్ట్ హీరో షారుఖ్ ఖాన్

బాద్‌షా, కింగ్‌ఖాన్ ఇవి షారుఖ్ ఖాన్‌ని ఇష్టపడే వారు పిలుచుకునే పేర్లు. ఆ పేర్లకు తగ్గట్టుగానే ఆయనకు కితాబులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని రిచెస్ట్ సినీ స్టార్‌ల లిస్ట్‌లో బాద్‌షా రెండో స్థానంలో ఉన్నాడనే విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్‌లను కలిపి తయారు చేసిన ఈ లిస్ట్‌లో షారుఖ్ ఖాన్ సెకెండ్ ప్లేస్‌లో నిలిచాడు. ఈ జాబితాను వెల్త్-ఎక్స్ అనే ప్రముఖ సంస్థ హాలీవుడ్ బాలీవుడ్ రిచెస్ట్ లిస్ట్ పేరుతో విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో హాలీవుడ్ కమెడియన్ జెర్రీ సీన్ ఫీల్డ్ 82 కోట్ల డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, 60 కోట్ల డాలర్లతో బాద్‌షా రెండవ స్థానంలో ఉన్నారు. భారత సినీ పరిశ్రమ నుంచి ఈ పట్టికలో చోటు సంపాదించుకున్న తొలి భారతీయ సెలబ్రిటీ షారుఖే. ప్రముఖ హాలీవుడ్ హీరోలను తోసి రాజని షారుఖ్ ఈ స్థానాన్ని సంపాదించడం ఇప్పుడు హాలీ, టాలీవుడ్‌లలో హాట్ టాపిక్. హీరో, ఐపీఎల్ టీం ఓనర్‌, టీవీ వ్యాఖ్యాతగా ఆయనకు లభించే ఆదాయాలన్ని లెక్కలోనికి తీసుకున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.