English | Telugu

గబ్బర్ సింగ్‌తో గణేష్ కి గొడవలా !!!

పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం, అంత కంటే ప్రాణం అని చెప్పే తెలుగు సినిమా బడా నిర్మాత బండ్లగణేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మధ్య వాతావరణం కొంత మారిందని వార్త. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వెంకటేష్ తో మల్టీస్టారర్ ఫిల్మ్ మాత్రమే కాకుండా, గబ్బర్ సింగ్2 మూవీలోనూ నటిస్తున్నాడు.ఈ రెండు మూవీల తరువాత పవన్ మరో మూవీలో నటించడానికి చేయటానికి సిద్ధంగా ఉన్నాడనే విషయం బండ్ల గణేష్ చెవిన పడిందట. ఆ సినిమా కూడా తన బ్యానర్‌లోనే చేయమని గణేష్ పనన్‌ని కోరి, కమిట్‌మెంట్ తీసుకునేందుకు ప్రయత్నించగా, అందుకు పవన్ తర్వాత చెప్తానని బదులిచ్చాడట. అయినా బండ్ల గణేష్ అక్కడి నుంచి వెళ్లకుండా బలవంత పెట్టే సరికి పవన్ కుదరదని చెప్పినట్లు సమాచారం.
పనన్ ఈ మూవీ కుదరదు అనడానికి కారణం గురించి ఆరా తీస్తే మూడో సినిమా అనేది ఇప్పుడే నిర్ణయించుకునే పరిస్థితి లేకపోవటం వల్ల, కమిట్‌మెంట్ ఇచ్చెందుకు పవన్ వెనుకడారని తెలుస్తోంది.గబ్బర్ సింగ్ తరువాత బండ్ల గణేష్ తీసిన మూవీలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే పవన్ మూవీతో టాలీవుడ్ మరో సూపర్ హిట్ కొట్టాలని బండ్ల గణేష్ ఎదురుచూస్తున్నాడు. ఏమైనా పవన్ కళ్యాణ్ పై బండ్లగణేష్ కి అదే అభిమానం ఇంకా ఉందని అంటున్నారు ఇది తెలిసిన వారు.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.