English | Telugu

మనం అందరి సినిమా

మూడు తరాల మనం చిత్రం గత కొన్ని నెలలుగా అక్కినేని అభిమానులను, సినీ అభిమానులను ఎంతగానో ఊరించిన మనం చిత్రం విడుదలపై పాజిటివ్ టాక్ కొనసాగుతోంది. చిత్రకథ చాలా చాలా ట్విస్ట్‌లున్నప్పటికీ చిత్రం అంతా అలా హాయిగా సాగిపోతుంది. సినిమాలో ఏఎన్‌ఆర్ తక్కువ సేపు కనిపించినా ఆయన సినిమా అంతా మన వెన్నంటే ఉన్నారనే ఫీల్ వుంటుంది. చిత్రంలో అక్కినేని కుటుంబంతో పాటు నటించిన వారంతా తమ తమ పాత్రలలో ఇమిడి పోయారని అనిపిస్తుంది. అయినా అందరికంటే ఎక్కువగా నాగార్జున మెప్పిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. పోటాపోటీగా ఏ పాత్రలు అనిపించకుండానే ఏ పాత్రకు ఆ పాత్ర మనని కట్టిపడేస్తాయి.ఇక హీరోయిన్లు శ్రేయా, సమంతలలో, సమంత చురుకుదనం, చిలిపిదనం ముచ్చటగా అనిపిస్తుంది.
చిత్రకథ కొంత కాంప్లెక్స్‌గా ఉన్నప్పటికీ, దానిని సింపుల్‌గా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఎందుకంటే సినిమా కథ అంతా హాయిగా సాగిపోతుంది కాబట్టి.ఇక ఏఎన్‌ఆర్ నటించిన ఈ చిత్రంలో ఆయన ఇద్దరు మనుమలు నటించారు. నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరుస్తాడు. ఉన్న కాసేపే అఖిల్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అనే ఇంప్రెషన్ ఇచ్చాడు.
సినిమాలో ప్రతి ఫ్రేముని ఎంతో అందంగా చూపించటంలో పి.ఎస్. వినోద్ ప్రతిభ కనిపిస్తుంది. ఆయన సినిమాటాగ్రఫి ఆడియెన్స్‌ని సీటు నుంచి కదలకుండా చేస్తుందని చెప్పవచ్చు. అనూప్ రూబెన్స్ సంగీతం, విక్రమ్ కుమార్ డైరెక్షన్ మనందరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా విక్రమ్ కుమార్ కథను బ్యాలెన్స్ చేసిన తీరు సినిమాకు మరింత బ్యూటీని చేకూర్చింది. ఒక కొత్త కథను సరికొత్తగా చూపించగల దర్శక ప్రతిభకు ఈ సినిమా మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు
ప్యామిలీ చిత్రమే అయినప్పటికీ, ఏడుపులు, భారీ సన్నివేషాలు లేకుండా సింపుల్‌గా చక్కటి ఫీల్‌తో సాగిపోతుంది.ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు వచ్చిన ఈ టాక్‌తో సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.