English | Telugu
రవితేజ కి పోటీగా తమిళ దర్శకుడు
Updated : Oct 25, 2023
ఏ బాష కి సంబంధించిన సినిమా రంగాన్ని తీసుకున్నా కూడా ఆయా సినిమా రంగంలో హీరోలు దర్శకులుగా మారిన వారు అలాగే దర్శకులు హీరోలాగా మారిన వారు అలాగే నటులు గ మారిన వాళ్ళు ఉన్నారు. ఇలా తాము పరిచయమైన రంగంలోనే కాకుండా 24 క్రాఫ్ట్స్ లో మల్టీ టాలెంట్ ని నిరూపించుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు .అలా మల్టి టాలెంట్ కలిగిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్. డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించిన ఆయన ఇప్పుడు నటుడుగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఇప్పుడు ఈ వార్త టాక్ అఫ్ ది టాలీవుడ్ అయ్యింది.
మాస్ మహారాజ రవితేజ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం లో హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ఒక ముఖ్యమైన పాత్ర ని పోషించబోతున్నాడు. RT4GM పేరుతో సెల్వ రాఘవన్ స్టిల్ తో కూడిన ఒక లుక్ ని కూడా మేకర్స్ అధికారకంగా విడుదల చేశారు.సెల్వ రాఘవన్ బ్లాక్ కోట్ ధరించి కళ్ళకి కళ్ల జోడు పెట్టుకొని కొంచం సీరియస్ లుక్కులో ఉన్నాడు.
సెల్వ రాఘవన్ పేరుకి తమిళ చిత్రపరిశ్రమకి సంబంధించిన దర్శకుడే అయినా తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయస్తుడే. ఆయన దర్శకత్వంలో 2004 లో వచ్చిన 7 / g బృందావన కాలనీ సినిమా తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపింది. ఇటీవలే ఆ సినిమా సెకండ్ రిలీజ్ అయ్యి రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. అలాగే తెలుగులో డైరెక్ట్ గా విక్టరీ వెంకటేష్ తో ఆడవారి మాటలకి అర్ధాలు వేరులే అనే సినిమాకి డైరెక్క్షన్ చేసి సెల్వ రాఘవన్ మా తెలుగు దర్శకుడే అని అందరు అనుకునేలా చేసాడు. గతంలో తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన సెల్వ రాఘవన్ తెలుగులో రవి తేజ మూవీ లో మొట్టమొదటి సారిగా నటించబోతున్నాడు. రాబోయే రోజుల్లో సెల్వ రాఘవన్ నటుడుగా తెలుగు చిత్ర సీమలో ఫుల్ బిజీ అవుతాడేమో..