English | Telugu
మేం డెడ్ బాడీకి మేకప్ వేయం.. ఇదెక్కడి మాస్ స్పీచ్
Updated : Oct 25, 2023
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ కుల, మత, ప్రాంతం అనే తేడా లేకుండా ఎందరో తమ గళం వినిపిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ సైతం బాబుతోనే మేము అంటూ కదిలి వచ్చింది. చంద్రబాబుకు సంఘీభావం తెలియజేస్తూ నేడు(బుధవారం) నిర్మాత నట్టి కుమార్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్ లోని తెలుగు నిర్మాతల మండలి హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎందరో సినీ ప్రముఖులతో పాటు, చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బాబుకు సంఘీభావం తెలియజేస్తూ నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు ఏ.ఎస్. రవికుమార్ చౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఏ.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ.. "కొంచెం గట్టిగానే మాట్లాడదాం అనుకుంటున్నాను. మేము సినిమా వాళ్ళం.. ముఖానికి రంగులు వేస్తాం, ముఖానికి రంగులు వేయించుకుంటాం.. కానీ స్మశానాలకు రంగులు వేయం. మేము సినిమా వాళ్ళం.. బాడీకి మేకప్ చేయిస్తాం కానీ డెడ్ బాడీకి మాత్రం మేం మేకప్ చేయించం. అంత నిజాయితీగా ఉండే సినిమావాళ్ళం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా ఇక్కడకు వచ్చారు. తెలంగాణ వాసులు సైతం ఇక్కడ ఉన్నారు. అది సంఘీభావం చంద్రబాబు గారికి. మేము చంద్రబాబుతో ఉన్నాం. మొత్తం సినీ పరిశ్రమ ఇక్కడికి రాకపోవచ్చు. కానీ సినీ పరిశ్రమలో ఉన్న 90 శాతం మంది చంద్రబాబు గారికి మద్దతుగా ఉన్నారు. కులాలతో సంబంధం లేకుండా అందరూ సీబీఎన్ తో ఉన్నారు. కేసులకు భయపడం, దేనికీ భయపడం, ధైర్యంగా ఉంటాం, అభివృద్ధి కోసం పోరాడతాం, అభివృద్ధికే ఓటేస్తాం" అన్నారు.