English | Telugu

వామ్మో సుధీర్ ఇలా కూడా చేస్తాడా!

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నాడు. ‘గాలోడు’ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ సాధించిన సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

టీవీ షోస్‌లో న‌వ్వించిన సుధీర్, 'గాలోడు' చిత్రంలో మాస్ హీరోగా ఆక‌ట్టుకున్నాడు. అయితే ఈసారి మ‌రో డిఫ‌రెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్బంగా చిత్ర నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘నిర్మాతలుగా ‘కాలింగ్‌ సహస్ర’ మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ. డైరెక్టర్ అరుణ్‌గారు, హీరో సుధీర్‌గారు, హీరోయిణ్ డాలీషా గారి స‌పోర్ట్‌తో సినిమాను పూర్తి చేశాం. ఔట్ పుట్ సూప‌ర్‌గా వ‌చ్చింది. స‌రికొత్త సుధీర్‌ను చూస్తార‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. ఇందులో సుధీర్ పాత్ర‌ను వెండి తెర‌పై చూసిన ఆడియెన్స్ వామ్మో సుధీర్ ఇలాంటి పాత్ర‌లో కూడా న‌టిస్తారా అనేంత వైల్డ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో, మాసీగా ఉంటుంది. ప్రేక్ష‌కులు ఊహించ‌ని మ‌లుపులతో సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఆక‌ట్టుకోనుంది మా కాలింగ్‌ సహస్ర మూవీ. పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా సన్ని.డి, ఎడిటర్ గా గ్యారీ బి.హెచ్‌ వ్యవహరిస్తున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.