English | Telugu

ఏప్రెల్ 18 న అల్లరి నరేష్ "సీమటపాకాయ్" ఆడియో రిలీజ్

ఏప్రెల్ 18 న అల్లరి నరేష్ "సీమటపాకాయ్" ఆడియో రిలీజ్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే వెల్ ఫేర్ క్రియేషన్స్ పతాకంపై, అల్లరి నరేష్ హీరోగా, పూర్ణ అనే కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో, డాక్టర్ మళ్ళ విజయ ప్రసాద్ యమ్.యల్.ఎ. నిర్మిస్తున్న చిత్రం "సీమటపాకాయ్". ఈ చిత్రానికి వందే మాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందిస్తున్నారు.


అంతే కాకుండా గతంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సూపర్ హిట్ చిత్రం "సింహాసనం"లోని "ఆకాశంలో ఒకతార నా కోసం వచ్చింది ఈ వేళ" అనే పాటను ఈ అల్లరి నరేష్ "సీమటపాకాయ్" చిత్రంలో రీమిక్స్ చేస్తున్నారు. ఏప్రెల్ 18 న అల్లరి నరేష్ "సీమటపాకాయ్" ఆడియో రిలీజ్ చేయనున్నారు. ఈ అల్లరి నరేష్ "సీమటపాకాయ్" చిత్రాన్ని ఏప్రెల్ నెలాఖరున గానీ లేదా "మే" నెల మొదటి వారంలో గానీ విడుదల చేస్తారు. గతంలో అల్లరి నరేష్, నాగేశ్వర రెడ్డిల కాంబినేషన్ లో "సీమ శాస్త్రి" అనే హిట్ మూవీ వచ్చింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.