English | Telugu
రక్షిత్ శెట్టి షాకింగ్ నిర్ణయం వెనుక ఎవరైనా ఉన్నారా?
Updated : Sep 29, 2023
సాధారణంగా ఏ భాషకి సంబంధించిన సినిమా అయినా ఆ సినిమా యొక్క మేకర్స్ అభిష్టం మేరకు డైరెక్టుగా థియేటర్ లోకి లేదా ఓటిటి లోకి రిలీజ్ అవుతుంది .ఆ తర్వాత ఆ సినిమా తీసిన విధానం ప్రకారం ఆడియన్స్ కి నచ్చితే హిట్ అవుతుంది.ఒక వేళ డైరెక్టుగా థియేటర్ లో రిలీజ్ అయినటువంటి సినిమా ఫెయిల్ అయితే వెంటనే మేకర్స్ ఓటిటి లో రిలీజ్ చేస్తుంటారు. ఆ తర్వాత సినిమా హిట్ అయితే ఒక నాలుగు,ఐదు వారాల తర్వాత ఓటిటి లోకి ఆ సినిమా వస్తుంది. కానీ ఇప్పుడు సినిమా బాగుందనే టాక్ తెచ్చుకున్నా కూడా థియేటర్ లో రిలీజ్ అయిన మొదటి వారానికే ఒక సినిమా ఓటిటి లో కి వచ్చేస్తుంది.
కన్నడ సూపర్ రక్షిత్ శెట్టి గురించి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు చాలా మందికి తెలుసు. గతంలో చార్లీ అనే సినిమాతో రక్షిత్ శెట్టి ఆ ఘనతని సాధించాడు. ఇప్పుడు గత వారం సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ అనే ఒక అద్భుతమైన లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .తన మాతృ బాష అయిన కన్నడం తో పాటు తెలుగులోకి కూడా ఆ సినిమా డబ్ అయ్యి మంచి ఫీల్ ఉన్న లవ్ సినిమా గా ప్రేక్షుకుల్ని ఎంతగానో రంజింపచేసింది. రక్షిత్ శెట్టి నిర్మాణంలోనే దర్శకుడు హేమంత్ ఎంరావు తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లో హీరోయిన్ గా యంగ్ నటి రుక్మిణి నటించింది. రక్షిత్ అండ్ రుక్మిణి ఫెయిర్ సూపర్ గా ఉందని అలాగే సినిమా లో ఇద్దరు ప్రాణం పెట్టి నటించారని సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు .మరి సప్త సాగరాలు దాటి సినిమా బాగుందనే టాక్ తెచ్చుకొని నిదానంగా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్న వేళ ఇప్పుడు సినిమా హఠాత్తుగా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటిటి లో రిలీజ్ అయ్యింది.